మేషరాశి వారికి ధనలాభం ఎలా ఉందో తెలుసుకోండిలా..
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : ఆదివారం పక్షం : శుక్లపక్షం తిథి : దశమి (నిన్న రాత్రి 6 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 17 ని॥ వరకు) నక్షత్రం : చిత్త (నిన్న రాత్రి 8 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు […]
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న రాత్రి 6 గం॥ 42 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 17 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న రాత్రి 8 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 46 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : తైతిల
వర్జ్యం : ( తెల్లవారు జాము 3 గం॥ 52 ని॥ నుంచి 5 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 21 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( ఉదయం 12 గం॥ 48 ని॥ నుంచి మధ్యాహ్నం 2 గం॥ 17 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( సాయంత్రం 5 గం॥ 6 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 58 ని॥ వరకు)
రాహుకాలం : (సాయంత్రం 5 గం॥ 13 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 51 ని॥ వరకు)
గుళికకాలం : (సాయంత్రం 3 గం॥ 34 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 12 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కన్య
మేషరాశి : స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇది మీకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. మరింత సంపాదన కొరకు సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. కావలసినంత ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం మీకు ఎంతో లాభకరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి స్త్రీలకు మీరు మీ భర్త కలిసి కుటుంబ వ్యవహారాల గురించి చర్చించుకుంటారు
వృషభ రాశి : ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గందరగోళం ను వదిలేయండి. చెడు అలవాట్ల ద్వారా డబ్బు నష్టం ఆరోగ్య నష్టం. అనుకోని అతిథుల వలన రోజువారి కార్యక్రమాలకు ఆటంకం. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. అందరితో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మధ్య చిన్న గొడవలు మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి.
మిధున రాశి : కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఖర్చులు ఎక్కువ కావడం మనోవేదనకు గురిచేస్తుంది. కొంతమంది ఉద్యోగం మార్పుకై ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడుల కై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో అనవసరపు గొడవలకు దిగకుండా సర్దుకుపొండి.
కర్కాటక రాశి : అనుకున్న కార్యాలను పట్టుదలతో సాధిస్తారు. పెద్ద వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి వారికి వారి యొక్క బాధ్యతలను గుర్తు చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను బాగా ఆలోచించి తీసుకోండి. ఆఫీసులో పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. కొందరికి జీతాల పెరుగుదల. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
సింహరాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆశావాహ దృక్పథం మరియు పట్టుదలతో పని చేయండి. కావలసినంత ధనం చేతికందుతుంది. అనవసరపు ఖర్చులు వదిలివేయండి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు వలన అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. అధిక శ్రమ వలన తలనొప్పి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొంత మంది విద్యార్థులకు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో గొడవలు పెట్టుకోకండి పట్టువిడుపులు ఉంటే మంచిది.
కన్యారాశి : మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. నిర్లక్ష్యంగా ఉంటే చేతికంది వచ్చిన అవకాశాలు పోతాయి. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. అనవసరపు దుబారా ఖర్చుల వలన మనశ్శాంతి కరవు. కుటుంబంలో పెద్ద వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసు పనులలో ఒత్తిడి వలన కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేక పోతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
తులారాశి : మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఆశావహ దృక్పథం పట్టుదల ఉంటే కార్యాలను సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయం బాగుంది కదా అని అనవసరపు ఖర్చులు చేయకండి. ఆఫీసు పనుల్లో నూతన బాధ్యతలు వలన అధిక శ్రమ ఒత్తిడి. స్నేహితులతో అనవసరపు బాతాఖానీ వలన సమయం వృధా.ఈ రాశి స్త్రీలకు మీ భర్త కుటుంబంలో మీ విలువను గుర్తించడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
వృశ్చిక రాశి : పట్టుదల, ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. స్థిరాస్తి అమ్మకాలు ఊహించని లాభాలను తెస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ప్రతి దాన్ని అనుమానించడం వల్ల కుటుంబంలో కలతలు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి మెప్పు పొందుతారు. విద్యార్థులు చదువు మానేసి టీవీ చూడటం వల్ల సమయం వృధా. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలత పెడుతుంది
ధనుస్సు రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. సహనం, పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. ఆడంబరాల కోసం ఖర్చు చేయకండి. దానివలన మనశ్శాంతి కరువవటమే కాక డబ్బు వృధా. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. స్నేహితులతో ఆనందంగా గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. కొంత మంది కి ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
మకర రాశి : అనవసర భయాందోళనలను వదిలివేయండి. మీరు అనుకుంటున్న గొప్ప కష్టాలేవీ కాలానికి నిలబడవు. సహనం, పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వామ్య తో గొడవలు రావచ్చు జాగ్రత్త. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. మీ ఎదుట లేని మూడవ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకండి. దాని వలన సమయం వృధా మరియు మీకు చెడ్డ పేరు. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో గొడవ పెట్టుకోకండి పట్టువిడుపులు ఉంటే మంచిది
కుంభరాశి : ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాన్ని పూర్తిచేస్తారు. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. అనవసరపు బాతాఖానీ వలన సమయం వృధా. పెద్ద వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఆఫీసు పనులు పెండింగ్ పెట్టకుండా సకాలంలో పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
మీనరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఒత్తిడి వలన మానసిక చికాకు. పట్టుదలతో పనులను పూర్తి చేయండి. అనవసరపు దుబారా ఖర్చుల వలన డబ్బు వృధా. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం వలన ఆనందం.