చెరుకు రైతులకు కేంద్రం శుభవార్త..
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా చెరుకు పండిస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలోని ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా నియామాకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే చెరుకు పంటకు సైతం కేంద్రం మద్దతు ధరను నిర్ణయించింది. పెంచిన ధర ప్రకారం క్వింటా చెరుకు పంటకు రూ.285గా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా […]
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా చెరుకు పండిస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలోని ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా నియామాకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
అందులో భాగంగానే చెరుకు పంటకు సైతం కేంద్రం మద్దతు ధరను నిర్ణయించింది. పెంచిన ధర ప్రకారం క్వింటా చెరుకు పంటకు రూ.285గా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్నచెరుకు రైతులకు లబ్ది చేకూరనుంది.