పరిశుభ్రత లేదని నిలదీత..
పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసిన రాష్ట్ర ఎక్సయిజ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి సర్పరాజు గ్రామంలో పరిశుభ్రత కానరాకపోవడంతో సర్పంచ్‌కు, అధికారులకు క్లాస్ ఇచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి, జలాలపురం, వంకమామిడి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంకమామిడి గ్రామంలో హరితహారంలో చెరువు కట్టపై నాటిన ఈత మొక్కలను పరిశీలించారు. జలాల్‌పురంలో నర్సరీ, అంగన్వాడీ, శానిటేషన్ పనులను పరిశీలించారు. […]
పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసిన రాష్ట్ర ఎక్సయిజ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి సర్పరాజు గ్రామంలో పరిశుభ్రత కానరాకపోవడంతో సర్పంచ్‌కు, అధికారులకు క్లాస్ ఇచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి, జలాలపురం, వంకమామిడి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంకమామిడి గ్రామంలో హరితహారంలో చెరువు కట్టపై నాటిన ఈత మొక్కలను పరిశీలించారు. జలాల్‌పురంలో నర్సరీ, అంగన్వాడీ, శానిటేషన్ పనులను పరిశీలించారు. రెడ్డిపల్లి గ్రామంలో కంపోస్టు ఎరువుల తయారీని పరిశీలించారు. గ్రామాల్లో హరితహారం మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం పల్లె ప్రగతిలో ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను వాటి ఖర్చులను ఆదాయ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు బిల్లు చెల్లింపులు, పాడు బడిన బావుల పూడ్చివేత, శిథిలమైన ఇల్లు కూల్చివేత పనులకు ఎంత చెల్లించారో అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కార్యదర్శులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం లో మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాల శంకర్, ఎక్సైజ్ సూపరిండెంట్ ప్రియా, సీఐ నాగిరెడ్డి, ఏపీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.