నీట మునిగిన మహిళా రైతు కష్టం..
దిశ, డోర్నకల్: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న రైతుల పంట పొలాలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం రెవెన్యూ పరిధిలోని అమృ తండాకు చెందిన భానోత్ కేశ అనే మహిళా రైతు ఉన్న రెండు ఎకరాల పొలంలో పంట వేసింది. సుమారు 40 వేల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరీ పొలం సాగు చేసుకుంటోంది. అయితే ఉన్నట్లుండి మొన్న కురిసిన భారీ వర్షాలకు, వరద తాకిడికి […]
దిశ, డోర్నకల్: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న రైతుల పంట పొలాలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం రెవెన్యూ పరిధిలోని అమృ తండాకు చెందిన భానోత్ కేశ అనే మహిళా రైతు ఉన్న రెండు ఎకరాల పొలంలో పంట వేసింది. సుమారు 40 వేల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరీ పొలం సాగు చేసుకుంటోంది.
అయితే ఉన్నట్లుండి మొన్న కురిసిన భారీ వర్షాలకు, వరద తాకిడికి భారీగా నీరు చేరి పంట పొలాలు నీట మునిగినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఇక ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది. వరద తాకిడికి నష్టపోయిన పంటను పరిశీలించి తగు న్యాయం చేయాలని అధికారులను కోరింది.