నాపై మంత్రి బాలినేని దాడి చేయించలేదు.. వైసీపీ నేత సుబ్బారావు గుప్తా

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా వ్యవహారంలో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. మంత్రి బాలినేని తనపై దాడి చేయించారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.  సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంగళవారం విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలలో మంత్రి బాలినేనితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం […]

Update: 2021-12-21 02:25 GMT

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా వ్యవహారంలో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. మంత్రి బాలినేని తనపై దాడి చేయించారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంగళవారం విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలలో మంత్రి బాలినేనితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి బాలినేని తనపై దాడి చేయించడం వార్తలు సరికాదన్నారు. సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణం అని ఆరోపించారు.

తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశానే తప్ప ఎవరినీ ఉద్దేశించి చేయలేదన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. పార్టీని బతికించుకోవాలన్న ఆకాంక్షతోనే ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అంతే తప్ప ఎటువంటి దురుద్దేశ్యం లేదంటూ వివరణ ఇచ్చారు. మరో 29 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా ఉండాలని నేతలకు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News