సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వోకు విద్యార్థుల వినతి

దిశ, లింగాల: బాలల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలోని శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. బాలల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. గ్రామాలకు బస్సు సౌకర్యం, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, బాల కార్మికులు, పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య, వీటితో పాటు తదితర సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలల సంఘాల ప్రతినిధులు, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, […]

Update: 2021-11-17 02:19 GMT

దిశ, లింగాల: బాలల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలోని శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. బాలల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. గ్రామాలకు బస్సు సౌకర్యం, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, బాల కార్మికులు, పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య, వీటితో పాటు తదితర సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలల సంఘాల ప్రతినిధులు, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, ఎస్ వికె ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జనార్ధన్, మండల కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు, కమ్యూనిటీ ఆర్గనైజర్ మన్సూర్, సురేష్, మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..