బ్రేకింగ్.. ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత..

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్ఎస్‌యూఐ సంఘాలు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. సిలబస్ కూడా పూర్తి చేయకుండా పరీక్షలు నిర్వహించారని వారు మండిపడ్డారు. పరీక్ష పత్రాలు తిరిగి రివాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిదని […]

Update: 2021-12-17 01:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్ఎస్‌యూఐ సంఘాలు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు.

సిలబస్ కూడా పూర్తి చేయకుండా పరీక్షలు నిర్వహించారని వారు మండిపడ్డారు. పరీక్ష పత్రాలు తిరిగి రివాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిదని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News