మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య
దిశ, మహబూబాబాద్: ఏ ప్రయత్నమైనా, ఏ పరీక్ష అయినా సరే.. మనం సరైన విధంగా సఫలం కానప్పుడు మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. ఎందుకంటే పుట్టినప్పుడు ఎవ్వరూ ముందే నేర్చుకునే పుట్టరు. ఎదుగుతున్నా కొద్దీ ఏదైనా కూడా ఓపికగా నేర్చుకోవాలి. అది మనకు రానప్పుడు ఓపికగా మళ్లీ మళ్లీ నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చే విజయకేతనమే మనమేంటో అన్నది తెలిసి ఇతరులకు ఆదర్శంగా నిలబడుతాం. కాకపోతే కాస్త టైం పడుతుంది. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అంతే కానీ .. […]
దిశ, మహబూబాబాద్: ఏ ప్రయత్నమైనా, ఏ పరీక్ష అయినా సరే.. మనం సరైన విధంగా సఫలం కానప్పుడు మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. ఎందుకంటే పుట్టినప్పుడు ఎవ్వరూ ముందే నేర్చుకునే పుట్టరు. ఎదుగుతున్నా కొద్దీ ఏదైనా కూడా ఓపికగా నేర్చుకోవాలి. అది మనకు రానప్పుడు ఓపికగా మళ్లీ మళ్లీ నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చే విజయకేతనమే మనమేంటో అన్నది తెలిసి ఇతరులకు ఆదర్శంగా నిలబడుతాం. కాకపోతే కాస్త టైం పడుతుంది. మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అంతే కానీ .. అనవసరమైన చర్యలకు పూనుకోవొద్దు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారొక్కరినే కాదు.. ఎన్నో ఆశలతో కనిపెంచి పోషించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను, బంధవులను, స్నేహితులను.. ఇలా చాలా మందినే ఒంటరిని చేస్తుంటాయి. అంతేకాదు.. నీ నీతి, నిజాయితీ, ధైర్య సాహసాలు, నీ బలమేందో జనానికి తెల్వకుండా పోతుంది. అయితే ఈ మాటలు ఎందుకు నెమరవేసుకోవాల్సి వస్తుందంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం చాలా మందిని దు:ఖంలోకి నెట్టేసింది. విషయమేమిటంటే.. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన సరయు అనే ఇంటర్ విద్యార్థిని.. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని శుక్రవారం ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి సరయు తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.