కురవిలో విషాదం.. విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థిని మృతి

దిశ కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థిని మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గత రెండ్రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాలనీల్లోకి వరదనీరు చేరి, పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి వేలాడుతున్నాయి. మంగళవారం వేలాడుతున్న విద్యుత్ వైర్ తగిలి దీక్షిత(15) అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ […]

Update: 2021-09-28 08:20 GMT

దిశ కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థిని మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గత రెండ్రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాలనీల్లోకి వరదనీరు చేరి, పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి వేలాడుతున్నాయి. మంగళవారం వేలాడుతున్న విద్యుత్ వైర్ తగిలి దీక్షిత(15) అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది.

మృతురాలు ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న మండల తహసీల్దార్ కొల్లూరి విజయ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి, ఓదార్చారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరపున పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ తోపాటు జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి విద్యార్థినికి నివాళులర్పించారు.

Tags:    

Similar News