టీసీ ఇవ్వడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం..

దిశ, కామరెడ్డి : అవమాన భారంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ధనావత్ రాము అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం నల్లమడుగు తండాకు చెందిన ధనావత్ రాము జిల్లా కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్నాడు. కరోనా తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభంమై రెండు నెలలు గడిచినా విద్యార్థి […]

Update: 2021-03-02 22:20 GMT

దిశ, కామరెడ్డి : అవమాన భారంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ధనావత్ రాము అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం నల్లమడుగు తండాకు చెందిన ధనావత్ రాము జిల్లా కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్నాడు. కరోనా తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభంమై రెండు నెలలు గడిచినా విద్యార్థి పాఠశాలకు రాకపోడంపై ప్రధానోపాధ్యాయుడు మండిపడ్డాడు.

అయితే గత నెల 26 న రాము జిల్లా ఆస్పత్రిలో కరోన పరీక్ష చేయించుకుని పాఠశాలకు వెళ్లగా ఇన్నిరోజుల నుంచి ఎందుకు రాలేదని ప్రిన్సిపాల్ దీప్లా విద్యార్థిని నిలదీశారు. ఇంటి వద్ద బంధువు చనిపోయి పరిస్థితులు బాగాలేక రాలేకపోయానని ప్రిన్సిపాల్ కు చెప్పాడు.అయినా ప్రిన్సిపాల్ వినకుండా ఇంటివద్దనే ఉండి చదువుకో అని చెప్పాడు. తాను ఇక్కడే ఉండి చదువుకుంటానని తెలిపినా వినకుండా, టీసీ ఇచ్చి పంపిస్తానన్నాడు. అదేవిధంగా ఆరోజే రాముతో తనకు స్కూల్ కు రావడం ఇష్టం లేదని పేపర్ పై రాయించుకుని టీసీ ఇచ్చి పంపించేశారు. మరుసటి రోజు తండ్రి వచ్చి బతిమాలి కాళ్ళు మొక్కినా ప్రిన్సిపాల్ వినిపించుకోలేదు.

తోటి విద్యార్థులతో చదువుకోలేక ఇంటివద్దనే ఉన్న రాము అవమానంగా భావించి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రామును జిల్లా ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమ కుమారుని టీసీ రద్దు చేసి పాఠశాలలో తిరిగి చేర్చు కోవాలని అలానే ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని రాము తండ్రి రాంసింగ్ కోరుతున్నాడు.

Tags:    

Similar News