ఆలోచనల రూపకల్పనకు సమయం కేటాయించాలి
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి, సంబంధిత అనిశ్చిత సమయాల్లో వ్యాపారాలను నిర్వహించడంపై ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో సీఈవో రితేష్ అగర్వాల్ యువ, వర్ధమాన పారిశ్రామికవేత్తలకు సలహాలిచ్చారు. కొత్తగా వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారు ఎక్కువ సమయం తమ ఆలోచనల రూపకల్పనకు కేటాయించాలని సూచించారు. ‘కొత్త పారిశ్రామికవేత్తలు కఠినమైన సమయాల్లో స్వీయ పరిశోధన చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఃఎవరికి వారు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవాలి. చుట్టూ ఉండే వారితో అలాంటి వాటిపై చర్చించవచ్చు. మీ […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి, సంబంధిత అనిశ్చిత సమయాల్లో వ్యాపారాలను నిర్వహించడంపై ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో సీఈవో రితేష్ అగర్వాల్ యువ, వర్ధమాన పారిశ్రామికవేత్తలకు సలహాలిచ్చారు. కొత్తగా వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారు ఎక్కువ సమయం తమ ఆలోచనల రూపకల్పనకు కేటాయించాలని సూచించారు. ‘కొత్త పారిశ్రామికవేత్తలు కఠినమైన సమయాల్లో స్వీయ పరిశోధన చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవాలి.
ఃఎవరికి వారు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవాలి. చుట్టూ ఉండే వారితో అలాంటి వాటిపై చర్చించవచ్చు. మీ ఆలోచనలను రూపొందించేందుకు సరైన సమయాన్ని కేటాయించడమే కాకుండా దానికోసం మీ సహోద్యోగులు, సన్నిహితులతో చర్చించడం ఎంతో ఉపయోగపడుతుందని’ రితేష్ అభిప్రాయపడ్డారు. ఇటీవల రితేష్ అగర్వాల్ యూరప్‌లో సుమారు రూ. 2600-రూ. 2,900 కోట్ల విలువ పెట్టుబడులను పెట్టారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన..కొవిడ్-19 సంక్షోభంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ మార్కెట్ల నుంచి లభించిన ప్రోత్సాహంతో పెట్టుబడులను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.