గులాబీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, చర్ల: చర్లలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మండల అధ్యక్ష, కార్యదర్శులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాలో (వాట్సాప్, ఫేస్‌బుక్) ఎవరుపడితే వారు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు. ఇటీవల ఎస్టీ సెల్ నాయకుడు నాగరాజు మండల నాయకత్వం అనుమతి లేకుండా పార్టీకి సంబంధంలేని ట్రైకార్ లోన్ల గ్రామసభకి హాజరై నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రసంగం మీడియాలో (ముందుగా దిశలో) ప్రచురితం కావడంతో అధికార పార్టీ తీరుపై రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిథులు […]
దిశ, చర్ల: చర్లలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మండల అధ్యక్ష, కార్యదర్శులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాలో (వాట్సాప్, ఫేస్‌బుక్) ఎవరుపడితే వారు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు. ఇటీవల ఎస్టీ సెల్ నాయకుడు నాగరాజు మండల నాయకత్వం అనుమతి లేకుండా పార్టీకి సంబంధంలేని ట్రైకార్ లోన్ల గ్రామసభకి హాజరై నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రసంగం మీడియాలో (ముందుగా దిశలో) ప్రచురితం కావడంతో అధికార పార్టీ తీరుపై రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిథులు విమర్శలు చేశారు. సంబంధిత అధికారులు ఈ విషయమై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకత్వం కేడర్‌కి జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు పార్టీ కమిటీల విషయమై నాయకులు, కార్యకర్తలు వాట్సాప్ వార్ చేశారు. ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ఈ విధంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించడంపై వారు దృష్టిపెట్టారు. సోషల్ మీడియా ద్వారా పార్టీని బజారునపడేస్తున్నవారిని కట్టడి చేసేందుకు నాయకత్వం నడుం బిగించింది.
ఇకపై మండల అధ్యక్షుడు అనుమతితో అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో పార్టీ, అనుబంధ సంఘాల కార్యక్రమాలు నిర్వహించాలని, అట్టి కార్యక్రమాలకు సంబంధించిన మ్యాటర్, ఫొటోలు పార్టీ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిలు పంజా రాజు, శివకుమార్‌లు మాత్రమే ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తారని, ఎవరుపడితే వారు పోస్టులు చేయవద్దని పార్టీ శ్రేణులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.