స్వీట్ న్యూస్ వినిపించనున్న కాజల్..?

దిశ, వెబ్‌డెస్క్: కాజల్ అగర్వాల్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అమ్మడు తన నటన, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కాజల్ చేసిన ప్రతి సినిమాలోనూ తన మార్క్ వేసింది. అయితే కాజల్ ఇటీవల గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఈ వార్త కొందరు అభిమానులను బాధ పెట్టినా.. కొందరు మాత్రం జంట అదుర్స్ అని సర్ది చెప్పుకున్నారు. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాజల్ […]

Update: 2021-12-07 21:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాజల్ అగర్వాల్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అమ్మడు తన నటన, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కాజల్ చేసిన ప్రతి సినిమాలోనూ తన మార్క్ వేసింది. అయితే కాజల్ ఇటీవల గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఈ వార్త కొందరు అభిమానులను బాధ పెట్టినా.. కొందరు మాత్రం జంట అదుర్స్ అని సర్ది చెప్పుకున్నారు. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కాజల్ త్వరలో ఫ్యాన్స్‌కి ఓ స్వీట్ న్యూస్ చెప్పనుందంటూ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాజల్ తల్లి కానుందని అందుకనే ప్రస్తుతం తన సినిమా చిత్రీకరణల్లోనూ అంతగా పాల్గొనడం లేదని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కాజల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి త్వరలో అభిమానులకు నిజంగానే ఏమైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే తల్లి కానున్న కారణంగానే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' సినిమా నుంచి కూడా కాజల్ తప్పుకుందంటూ సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కాజల్ ప్లేస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. వీటిలో ఏ ఒక్క ప్రకటన వచ్చినా కాజల్ తల్లి కానున్న వార్త నిజమవుతుందని అభిమానులు ఊహిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma