నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

దిశ, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ఎవరూ బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉండాలనీ, అత్యవసరం ఐతే బయటకు వచ్చినప్పుడు విధిగా నోరు, ముక్కు కవర్ చేస్తూ మాస్క్‌ లేదా చేతి రుమాలును కట్టుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఏ సమస్యలున్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ […]

Update: 2020-04-20 00:06 GMT

దిశ, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ఎవరూ బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉండాలనీ, అత్యవసరం ఐతే బయటకు వచ్చినప్పుడు విధిగా నోరు, ముక్కు కవర్ చేస్తూ మాస్క్‌ లేదా చేతి రుమాలును కట్టుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఏ సమస్యలున్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ పరిధిలో కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్లు ప్రజల సహకారంతో ప్రణాళికలు రూపొందించుకుని కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే, అనవసరంగా బయట తిరుగుతున్న వాహనాలు సీజ్ చేస్తామని, మాస్క్ ధరించకుండా బయటకు వచ్చిన వారిపై అధికమొత్తంలో జరిమానాలువిధిస్తామని స్పష్టం చేశారు.

Tags : Strict, regulations, Collector, lackdown, corona, redzone

Tags:    

Similar News