మున్సిపల్ ఎన్నికల్లో వింత ఘటన.. బ్యాలెట్ బాక్సులో లేఖ
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓటుతో పాటూ ఓ లేఖ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వారికి ఒక్కసారిగా అసెంబ్లీ రౌడీ మూవీ సీన్ గుర్తుకువచ్చింది. ఆ లేఖలో ఏం రాసి ఉందోనని ఆతృతగా చూశారు. తీరా చదివి అవాక్కయ్యారు. మందుబాబులు చేసిన విన్నపంతో నవ్వు ఆపుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన […]
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓటుతో పాటూ ఓ లేఖ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వారికి ఒక్కసారిగా అసెంబ్లీ రౌడీ మూవీ సీన్ గుర్తుకువచ్చింది. ఆ లేఖలో ఏం రాసి ఉందోనని ఆతృతగా చూశారు. తీరా చదివి అవాక్కయ్యారు. మందుబాబులు చేసిన విన్నపంతో నవ్వు ఆపుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన ఓ లేఖ ఆశ్చర్యపరిచింది. ఆలేఖలో ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో వేసిన చీటీల్లో మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు, హైదరాబాద్, జంబో వంటి వాటిని తొలగించి పాత బ్రాండ్లు రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ రకాల అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. పాత బ్రాండ్లు అమ్మకపోతే తమ చివరి ఓటు కూడా ఇదేనంటూ హెచ్చరించాడు. ఈ విషయంపై వివరణ అడగ్గా ఈ విషయం తన దృష్టికి రాలేదంటూ నంద్యాల మున్సిపల్ ఎన్నికల సహాయ అధికారి సమాధానం చెప్పుకొచ్చారు.