హరప్పాలో దొరికిన వింత లడ్డూలు..పరిశోధనలో బయటపడ్డ విస్తుపోయే నిజాలు
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త వింతలను , విశేషాలను కనుగొనడానికి పురావస్తు శాస్త్రవేత్తలు కష్టపడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు తాము కనుగొన్న వింతలను ప్రజలకు తెలియజేస్తూ అవాక్కయ్యేలా చేస్తారు. కొన్నిసార్లు చరిత్రను తెలుపుతారు .. మరికొన్నిసార్లు గత స్మృతులను నెమరువేసుకునేలా చేస్తారు. తాజాగా అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన హరప్పాలో నివసించిన వారి అభిరుచులను, సాంప్రదాయాలను తెలియజేసారు. 2017లో పరిశోధకులు రాజస్థాన్‌లో తవ్వకాలు జరుపుతుండగా వింత లడ్డూలను కనుగొన్న […]
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త వింతలను , విశేషాలను కనుగొనడానికి పురావస్తు శాస్త్రవేత్తలు కష్టపడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు తాము కనుగొన్న వింతలను ప్రజలకు తెలియజేస్తూ అవాక్కయ్యేలా చేస్తారు. కొన్నిసార్లు చరిత్రను తెలుపుతారు .. మరికొన్నిసార్లు గత స్మృతులను నెమరువేసుకునేలా చేస్తారు. తాజాగా అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన హరప్పాలో నివసించిన వారి అభిరుచులను, సాంప్రదాయాలను తెలియజేసారు. 2017లో పరిశోధకులు రాజస్థాన్‌లో తవ్వకాలు జరుపుతుండగా వింత లడ్డూలను కనుగొన్న విషయం తెలిసిందే. తవ్వకాల్లో బయటపడ్డ ఆ 7 లడ్డూలను పరిశోధించిన పిమ్మట పలు ఆసక్తికరమైన విషయాలను శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
హరప్పాలో బయటపడ్డ ఆ లడ్డూలు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరానికి చెందినవిగా గుర్తించారు. అంతేకాకుండా ఆ లడ్డూలను మల్టీ గ్రెయిన్స్ పదార్ధాలతో తయారుచేసినట్లు తెలిపారు. అంటే.. బార్లే, గోధుమ, బఠాణీ లతో పాటు తృణ ధాన్యాలతో వాటిని తయారు చేసారు. వాటి పై భాగం గట్టిపడడంతో ఇప్పటికీ అవి చెక్కుచెదరకుండా ఉన్నాయని, వాటిపై నీరు పడితే రంగు మారుతుందని కనుగొన్నారు. ఇక వీటిని కొన్ని రహస్య కార్యకలాపాలకు వాడేవారని, మహిళలు వీటిని పూజకు ఉపయోగించేవారని శాస్తవేత్తలు తెలుపుతున్నారు.