రెండున్నర రెట్లు పెరిగిన నాన్-టాక్స్ రెవిన్యూ

దిశ, న్యూస్ బ్యూరో: కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గిపోతుందని తేలడంతో రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం పన్నేతర ఆదాయంపైనా కన్నేసింది. ఆదాయాన్ని సమకూర్చుకోడానికి సాధారణంగా ప్రభుత్వాలు పన్నులు పెంచుతూ ఉంటాయి. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వ్యతిరేకతను నివారించుకోడానికి నొప్పి తెలియని విధానాన్ని ఎంచుకుంది. అందులో భాగమే సర్కారు భూముల్ని అమ్మడం, మైనింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం. ఈ విధానం ద్వారా […]

Update: 2020-03-08 08:09 GMT
రెండున్నర రెట్లు పెరిగిన నాన్-టాక్స్ రెవిన్యూ
  • whatsapp icon

దిశ, న్యూస్ బ్యూరో: కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గిపోతుందని తేలడంతో రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం పన్నేతర ఆదాయంపైనా కన్నేసింది. ఆదాయాన్ని సమకూర్చుకోడానికి సాధారణంగా ప్రభుత్వాలు పన్నులు పెంచుతూ ఉంటాయి. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వ్యతిరేకతను నివారించుకోడానికి నొప్పి తెలియని విధానాన్ని ఎంచుకుంది. అందులో భాగమే సర్కారు భూముల్ని అమ్మడం, మైనింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం. ఈ విధానం ద్వారా మొత్తం రూ.30,600 కోట్లను సమకూర్చుకోవాలనుకుంటోంది. ఇందులో సర్కారు భూముల్ని అమ్మడం ద్వారా రూ. 14,879 కోట్లు ఉన్నాయి. ఇక రూ. 5,600 కోట్లను మైనింగ్ ద్వారా సమకూర్చుకోనుంది. నాన్ ఫెర్రస్ (ఇనుము మినహా ఇతర ఖనిజ సంపద) మైనింగ్ ద్వారా దీన్ని సమకూర్చుకోనుంది. మరో రూ. 4,446 కోట్లను హౌజింగ్ ద్వారా (హెచ్ఎండీఏ లాంటి సంస్థలు), రూ. 4001 కోట్లను పట్టణాభివృద్ధి ఖాతా ద్వారా సమకూర్చుకోనుంది.

రెండేళ్ల క్రితం 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7,825 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం ప్రభుత్వానికి సమకూరగా ఇప్పుడు అది ఏకంగా రూ. 30,600 కోట్లకు చేరుకుంటోంది. 2018-19లో సైతం ఈ ఆదాయం కేవలం రూ. 10వేల కోట్లు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం (2019-20)లో కూడా రూ. 12,275 కోట్లు మాత్రమే. ఇప్పుడు మాత్రం ఏకంగా రెండున్నర రెట్లు పెరిగి రూ. 30,600 కోట్లకు చేరుకుంటోంది. ఇప్పటికే మద్యం ధరలను, ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. మరిన్ని పన్నులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని గ్రహించి ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. త్వరలో భూముల విలువను కూడా సవరించనుంది. విద్యుత్ ధరలను పెంచాలని రెగ్యులేటరీ కమిషన్ సిఫారసు చేసినా ప్రభుత్వం మాత్రం ఆ వ్యతిరేకతను మూటగట్టుకోరాదన్న ఉద్దేశంతో పన్నేతర ఆదాయంవైపే మొగ్గుచూపింది.

tags: Telangana, Budget, non-Tax Revenue, Government Lands sale, Mining Revenue

Tags:    

Similar News