రాయల్స్ రివర్స్ అటాక్‌కు బ్రేక్!

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఏ జట్టు ఏ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుందో, పేలవ ప్రదర్శన చేస్తుందో ఊహాతీతం. ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో రాజస్తాన్‌కు భారీ టార్గెట్‌ నిర్దేశించిన పంజాబ్‌కు ఆ ఉత్సాహం ఎంతసేపు లేదనిపించేలా.. రాయల్స్ ఆటగాళ్లు రివర్స్ అటాక్ చేశారు. పంజాబ్ చేసిన స్కోర్‌ను ఓవర్ టు ఓవర్ ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా.. బౌండరీలను పారిస్తూ షాకింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ రోజే ఐపీఎల్‌ తొలి మ్యాచ్ ఆడిన జోస్ బట్లర్ […]

Update: 2020-09-27 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఏ జట్టు ఏ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుందో, పేలవ ప్రదర్శన చేస్తుందో ఊహాతీతం. ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో రాజస్తాన్‌కు భారీ టార్గెట్‌ నిర్దేశించిన పంజాబ్‌కు ఆ ఉత్సాహం ఎంతసేపు లేదనిపించేలా.. రాయల్స్ ఆటగాళ్లు రివర్స్ అటాక్ చేశారు. పంజాబ్ చేసిన స్కోర్‌ను ఓవర్ టు ఓవర్ ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు.

రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా.. బౌండరీలను పారిస్తూ షాకింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ రోజే ఐపీఎల్‌ తొలి మ్యాచ్ ఆడిన జోస్ బట్లర్ (4) కాస్తా నిరుత్సాహపరిచినా.. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ క్రీజులో కుదురుకొని అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. కేవలం 27 బంతుల్లో స్టీవ్ స్మిత్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో కుదురుకున్న సంజూ శాంసన్ తొలి 9 ఓవర్లు ముగిసే సరికి 20 బంతుల్లో 41 పరుగులతో జోరు మీద ఉన్నాడు. కానీ, తొమ్మిదో ఓవర్‌ రన్నింగ్‌లో నీశామ్ వేసిన బంతికి షార్ట్ ఆడబోయిన స్మిత్(50) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో రాయల్స్ స్పీడుకు పంజాబ్ బ్రేకులేసినట్టైంది. కానీ.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సంజూ శాంసన్ తన బ్యాటింగ్ కొనసాగించడం గమనార్హం.

Tags:    

Similar News