స్టీవ్ స్మిత్ మానసికంగా కుంగిపోయాడా?

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ కనబర్చిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లో 1, 1*, 0, 8 పరుగులు మాత్రమే చేశాడు. స్మిత్ విఫలం కారణంగా ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. సరైన సమయంలో అతడు చేతులెత్తేయడంతో రెండో టెస్టులో పరాజయం పాలవాల్సి వచ్చింది. భారత బౌలర్ల టెక్నిక్‌కి స్మిత్ బోల్తా పడ్డాడని విశ్లేషకులు భావించారు. […]

Update: 2021-01-01 10:23 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ కనబర్చిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లో 1, 1*, 0, 8 పరుగులు మాత్రమే చేశాడు. స్మిత్ విఫలం కారణంగా ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. సరైన సమయంలో అతడు చేతులెత్తేయడంతో రెండో టెస్టులో పరాజయం పాలవాల్సి వచ్చింది. భారత బౌలర్ల టెక్నిక్‌కి స్మిత్ బోల్తా పడ్డాడని విశ్లేషకులు భావించారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కిమ్ హ్యూస్ మాత్రం వేరే కారణం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కుటుంబం నుంచి దూరంగా ఉండటం వల్లే స్టీవ్ స్మిత్ విఫలమవుతున్నాడని, అతడు మానసికంగా కుంగిపోయాడని హ్యూస్ అంటున్నాడు.

‘స్మిత్ ఒక ప్రపంచస్థాయి ఆటగాడు. కానీ టెస్టుల్లో అతడి ప్రదర్శన సరిగా లేదు. అతను తన భార్య డానీ నుంచి నాలుగున్నర నెలలుగా దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. క్వారంటైన్ నిబంధనల కారణంగా తన భార్యకు దూరంగా ఉండటం స్మిత్‌కు చాలా ఇబ్బందికరంగా మారింది’ అని అన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పటి నుంచి స్మిత్ భార్య డానీకి దూరంగా ఉన్నాడు. ఇటీవల స్మిత్ కోసం ఆమె మెల్‌బోర్న్ వచ్చింది. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా ఆమె స్మిత్‌ను కలుసుకోలేకపోయింది.

 

Tags:    

Similar News