15 శాతం వాటాను విక్రయించిన స్టెర్‌లైట్ పవర్!
దిశ, వెబ్‌డెస్క్: పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ డెవలపర్ స్టెర్‌లైట్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT), ఇండియా గ్రిడ్ ట్రస్ట్‌లోని 14.7 శాతం వాటాను రూ. 840 కోట్లకు సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన వ్యక్తిగత పెట్టుబడిదారులకు విక్రయించింది. స్టెర్‌లైట్ పవర్ వాటాల (Sterlite Power Shares) ను ఒక్కోటి రూ. 98 కి విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. ఇండియా గ్రిడ్ ట్రస్ట్ (India Grid Trust) ఒప్పందం ప్రకారం రూ. 6,500 కోట్ల ఆస్తుల […]
దిశ, వెబ్‌డెస్క్: పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ డెవలపర్ స్టెర్‌లైట్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT), ఇండియా గ్రిడ్ ట్రస్ట్‌లోని 14.7 శాతం వాటాను రూ. 840 కోట్లకు సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన వ్యక్తిగత పెట్టుబడిదారులకు విక్రయించింది. స్టెర్‌లైట్ పవర్ వాటాల (Sterlite Power Shares) ను ఒక్కోటి రూ. 98 కి విక్రయించినట్టు కంపెనీ తెలిపింది.
ఇండియా గ్రిడ్ ట్రస్ట్ (India Grid Trust) ఒప్పందం ప్రకారం రూ. 6,500 కోట్ల ఆస్తుల బదిలీలను అమలు పరిచేందుకు కంపెనీ కట్టుబడి ఉంటుందని స్టెర్‌లైట్ పవర్ ఎండీ ప్రతీక్ అగర్వాల్ తెలిపారు. పవర్ ట్రాన్స్‌మిషన్ ఆస్తుల డెవలపర్లుగా తాము ప్రధాన వ్యాపారంపై దృష్టి పెడతామని, ఇండియా గ్రిడ్ ట్రస్ట్ ఒప్పందం (India Grid Trust) ప్రకారమే ఆస్తుల బదిలీకి కట్టుబడి ఉన్నట్టు ప్రతీక్ అగర్వాల్ స్పష్టం చేశారు.
స్టెర్‌లైట్ పవర్ (Sterlite Power), ఇండియా గ్రిడ్ (India Grid)కు స్పాన్సర్‌గా ఉంది. ఇది భారత్‌లోనే మొట్టమొదటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (Infrastructure Investment Trust). 2017లో అందుబాటులోకి వచ్చింది. వాటాలను కొనుగోలు చేసిన సంస్థల్లో లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ ఇంకా ఇతర కంపెనీలున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిసింది.