అంబేద్కర్ విగ్రహాలు మాయం

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎక్కడో ఓ చోట రోజూ భారత రాజ్యాంగా నిర్మాత అంబేద్క్‌కు అవమానం జరుగుతూనే ఉంది. విగ్రహాలు కూల్చడం, మాయం చేయడలం లాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం శాకమూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని అంబేద్కర్ స్మృతివనం వద్ద ఐదు విగ్రహాలు మాయం కావడంతో రాజధాని దళిత జేఏసీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా ఇప్పటికే […]

Update: 2020-09-10 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎక్కడో ఓ చోట రోజూ భారత రాజ్యాంగా నిర్మాత అంబేద్క్‌కు అవమానం జరుగుతూనే ఉంది. విగ్రహాలు కూల్చడం, మాయం చేయడలం లాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం శాకమూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని అంబేద్కర్ స్మృతివనం వద్ద ఐదు విగ్రహాలు మాయం కావడంతో రాజధాని దళిత జేఏసీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థకు కూడా ప్రభుత్వం వైపు నుంచి నోటీసులు వచ్చినట్టు సమాచారం. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, లైబ్రరీ, పార్క్‌ను ప్రభుత్వం స్వరాజ్య మైదానానికి మార్చడాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై స్మృతివనంవద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News