ప్రభుత్వం వద్ద భవిష్యత్ ప్రణాళికలు లేవు:కోదండ రామ్

దిశ‌, ఖ‌మ్మం : రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. గత ఏడాది లక్షా 30 వేల కోట్లతో ఉన్న రాష్ట్ర బడ్జెట్ నేడు 50 వేల కోట్లకు లోటుకు పడిపోయే ప్రమాదంలో ఉందని చెప్పారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదాయ వనరులు పడిపోయి పరిశ్రమలు, వ్యాపారాలు మూసివేసే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. విద్యా వైద్య రంగాల్లో 9నెలలుగా పురోగతి లేక… నిరుద్యోగులు,ప్రజలు ఉపాది […]

Update: 2020-11-29 08:47 GMT

దిశ‌, ఖ‌మ్మం : రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. గత ఏడాది లక్షా 30 వేల కోట్లతో ఉన్న రాష్ట్ర బడ్జెట్ నేడు 50 వేల కోట్లకు లోటుకు పడిపోయే ప్రమాదంలో ఉందని చెప్పారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదాయ వనరులు పడిపోయి పరిశ్రమలు, వ్యాపారాలు మూసివేసే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. విద్యా వైద్య రంగాల్లో 9నెలలుగా పురోగతి లేక… నిరుద్యోగులు,ప్రజలు ఉపాది దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వం వద్ద భవిష్యత్ ప్రణాళికలు లేవనీ.. ఉన్నదంతా కాంట్రాక్టర్లకు ఊడ్చి పెట్టిందని కోదండరాం విమర్శించారు. ప్రజలను అదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలనూ తీసుకోవట్లేదని అన్నారు. ప్రభుత్వ వనరులను దుబారా చేస్తూ కేసీఆర్ సర్కార్ పబ్బం గడుపుకుంటోందని అన్నారు. తెలంగాణ సమాజం ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఒక్క అవకాశం ఇస్తే మీ గొంతుకనై ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడతానని కోదండరాం అన్నారు.

Tags:    

Similar News