జస్టిస్ చంద్రయ్యకు ‘‘యూనివర్సల్ హ్యూమన్ రైట్స్’ అవార్డు

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ‘‘ యూనివర్సల్ హ్యుమన్ రైట్స్ – 2020’’ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్యకు అవార్డును బహుకరిస్తున్నట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ , కార్యదర్శి ప్రొఫెసర్ మహ్మద్ అక్తర్ అలీలు మంగళావారం ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి లోని హెచ్ఆర్సీ ఆవరణలో జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డును బహుకరించనున్నట్లు […]

Update: 2020-12-08 08:15 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ‘‘ యూనివర్సల్ హ్యుమన్ రైట్స్ – 2020’’ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్యకు అవార్డును బహుకరిస్తున్నట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ , కార్యదర్శి ప్రొఫెసర్ మహ్మద్ అక్తర్ అలీలు మంగళావారం ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి లోని హెచ్ఆర్సీ ఆవరణలో జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డును బహుకరించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో నెల్సన్ మండేలా అవార్డును కూడా జస్టిస్ చంద్రయ్య అందుకున్నారని తెలిపారు.

Tags:    

Similar News