రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి : దాసోజు

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడికి రాష్ట్ర, జిల్లా స్థాయి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ హైకోర్టును కోరారు. సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీనిని పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్(పిల్)గా స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ -19 చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, రెమిడివిసిర్, టోసిలిజుమాబ్ వంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాక్ […]

Update: 2021-05-10 11:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడికి రాష్ట్ర, జిల్లా స్థాయి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ హైకోర్టును కోరారు. సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీనిని పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్(పిల్)గా స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ -19 చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, రెమిడివిసిర్, టోసిలిజుమాబ్ వంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీచేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

హెల్త్ ఎమర్జెన్సీలో కూడా గత ఏడేళ్ళుగా ఖాళీగా ఉన్న 25,000 వైద్యులు, నర్స్ ఖాళీలని భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌ని గాలికి వదిలేసిందని, వ్యాక్సి నేషన్‌లో కూడా తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి కన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ప్రజలు సెకెండ్ వేవ్ కరోనా కోరల్లో చిక్కుకున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీస్ అడ్డంగా దోచుకుంటున్నాయని, గతంలో రెండు జీవోలు తెచ్చి రేట్లు నిర్ణయించినప్పటికీ ఆ జీవోలు చెత్తబుట్టలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల భయాన్ని క్యాష్ చేసుకొని లక్షల రూపాయిలు దోచుకుంటున్నాయన్నారు. దోపిడీ అరికట్టడానికి అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలేమీ తీసుకోలేదన్నారు.

వ్యాక్సిన్లను ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ని అరికట్టడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రతి జిల్లా హెడ్ క్యార్టర్‌లో 1000 పడకలు, ప్రతి మండల హెడ్ క్యార్టర్‌లో 30 పడకల ఆసుపత్రి, ప్రతి అసెంబ్లీ విభాగంలో 100 పడకల ఆసుపత్రులను నిర్మించాలని కోరారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండటానికి సీఎం కేర్ ఫండ్ల పూర్తి వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 

Tags:    

Similar News