లాక్ డౌన్ లో ఆరోగ్య చిట్కాలు

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలోనే రోజంతా కూర్చువడంతో అలసిపోయే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజటా దివేకర్ సోషల్ మీడియోలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పలు సూచనలు చేసింది. అవేమిటంటే.. ప్రతి 30 […]

Update: 2020-04-08 10:18 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలోనే రోజంతా కూర్చువడంతో అలసిపోయే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజటా దివేకర్ సోషల్ మీడియోలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పలు సూచనలు చేసింది. అవేమిటంటే.. ప్రతి 30 నిమిషాలకొకసారి 3 నిమిషాలపాటు నిలబడాలని తెలిపింది. ఈ సమయంలో గోడను, ఇతర వస్తువుల సహాయం తీసుకుని నిలబడద్దొని చెప్పింది. అదేవిధంగా కుర్చీపై కూడా ఈ 3 నిమిషాలపాటు స్వాట్స్ చేయొచ్చని చెప్పింది. అదెలాగో ఆ వీడియోలో చేసి చూపించింది.

Tags:    

Similar News