శ్రీశైలం ప్రాజెక్టు కొత్త రికార్డు
దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉదృతి పెరుగుతోంది. ఎన్నడూలేని విధంగా ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. ఎగువన జూరాల ప్రాజెక్టు 44 గేట్లు తెరిచి 4,90,469 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా… సుంకేసుల జలాశయం నుంచి 83,932 క్యూసెక్కుల నీరు రాగా మొత్తం 5,21,332 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్ కు చేరుతోంది. ఇప్పటికే డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు […]
దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉదృతి పెరుగుతోంది. ఎన్నడూలేని విధంగా ప్రాజెక్టుకు వరద నీరు చేరింది.
ఎగువన జూరాల ప్రాజెక్టు 44 గేట్లు తెరిచి 4,90,469 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా… సుంకేసుల జలాశయం నుంచి 83,932 క్యూసెక్కుల నీరు రాగా మొత్తం 5,21,332 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్ కు చేరుతోంది.
ఇప్పటికే డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.10 అడుగుల మేర నీటి మట్టం చేరుకోవడంతో డ్యామ్ 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,65,750 క్యూసెక్కులను జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,322 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.