పర్యాటకులకు నిరాశ.. శ్రీరాంసాగర్‌ గేట్లు మూసివేత

దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాం సాగర్ గేట్లను మూసివేశారు ప్రాజెక్ట్ అధికారులు. శనివారం సాయంత్రం ఆరున్నరకు 17 గేట్‌లను ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు.. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గడంతో మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు.. శనివారం ఉదయం నుంచే గేట్ల మూసివేతను ప్రారంభించారు అధికారులు. ఉదయం 30 గేట్ల ద్వారా నీటిని వదిలిన సమయంలో ప్రాజెక్టులో 1089 అడుగుల నీరు నిల్వ ఉంది. ఆ తరువాత వరద తగ్గుముఖం పట్టింది. దీంతో […]

Update: 2021-07-24 08:20 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాం సాగర్ గేట్లను మూసివేశారు ప్రాజెక్ట్ అధికారులు. శనివారం సాయంత్రం ఆరున్నరకు 17 గేట్‌లను ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు.. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గడంతో మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు.. శనివారం ఉదయం నుంచే గేట్ల మూసివేతను ప్రారంభించారు అధికారులు. ఉదయం 30 గేట్ల ద్వారా నీటిని వదిలిన సమయంలో ప్రాజెక్టులో 1089 అడుగుల నీరు నిల్వ ఉంది. ఆ తరువాత వరద తగ్గుముఖం పట్టింది. దీంతో 17 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో.. ప్రాజెక్టు సామర్థ్యానికి సరిపడ నీటిని నిల్వచేసి గేట్లు మూసివేశారు అధికారులు. ఇదే సమయంలో ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన పర్యాటకులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

Tags:    

Similar News