హుజురాబాద్‌లో గెలుపు ఆయనదే.. బయటపెట్టిన మంత్రి తలసాని

దిశ తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నియోజకవర్గం‌లో ఎమ్మెల్యేగా శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి తీరుతామని, ఆయన గెలుపు తధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నాయకుడు, జైలుకు వెళ్లి వచ్చిన […]

Update: 2021-08-11 02:38 GMT

దిశ తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నియోజకవర్గం‌లో ఎమ్మెల్యేగా శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి తీరుతామని, ఆయన గెలుపు తధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నాయకుడు, జైలుకు వెళ్లి వచ్చిన నేత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బహుజనుల బిడ్డ గెలుపును పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం యువతకు శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయం చేయాలని ముఖ్యమంత్రి భావించడం బీసీల అభివృద్ధికి నాంది అన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే ఒరిగేదేమీ లేదని, ఇద్దరు ఉన్న ఎమ్మెల్యేలు ముగ్గురికి చేరుతుంది అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ప్రజలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. నాగార్జునసాగర్ ఫలితాలే రేపు హుజురాబాద్‌లో రిపీట్ అవుతాయన్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొంతమంది దద్దమ్మలు దళిత బంధు‌పై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. దళిత బంధు కేవలం హుజురాబాద్‌కే కాదని రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని వెల్లడించారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. టీవీ, సోషల్ మీడియాలో వస్తుందని నోటికి ఏది పడితే అది మాట్లాడితే బాగుండదని ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. మాట్లాడేటప్పుడు స్థాయిని చూసుకొని మాట్లాడాలని సూచించారు. దళితులు బాగుపడడం ఇష్టం లేకనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. వారు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో ఏదైనా సాధ్యం అవుతుంది అంటే అది కేసీఆర్ తోనే అని పేర్కొన్నారు. హుజరాబాద్ లో సర్వేలన్నీ టీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నాయని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం తథ్యం అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ తోనే, సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News