‘ఆ పథకంతోనే మహబూబ్‌నగర్ సస్యశ్యామలం’

దిశ, మహాబూబ్‎నగర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమాను అందిస్తున్నామని గుర్తు చేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను వేసి […]

Update: 2020-06-04 02:45 GMT

దిశ, మహాబూబ్‎నగర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమాను అందిస్తున్నామని గుర్తు చేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను వేసి లాభాలను ఆర్జించాలనే లక్ష్యంగా నియంత్రిత సాగు పద్ధతి తీసుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ వనజా అంజనేయులు గౌడ్, కలెక్టర్ హరి చందన తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News