శ్రీనగర్‌లో ఇకపై వాటిని అమ్మడం, కొనడం నిషేధం
శ్రీనగర్: జమ్ములోని ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఇటీవల జరిగిన ‘డ్రోన్ అటాక్’ నేపథ్యంలో అక్కడి శ్రీనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా నగరంలో ఇకపై డ్రోన్ల వినియోగం, వాటిని నిల్వ చేయడం, అమ్మడం, కొనడం, రవాణాపై నిషేధం విధించింది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ మహ్మద్ ఆయిజాజ్ ఆదేశాలు జారీచేశారు. డ్రోన్ కెమెరాలు, ఇతర ఏరియల్ వెహికిల్స్ ఉన్నవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. అయితే, వ్యవసాయం, పర్యావరణ […]
శ్రీనగర్: జమ్ములోని ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఇటీవల జరిగిన ‘డ్రోన్ అటాక్’ నేపథ్యంలో అక్కడి శ్రీనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా నగరంలో ఇకపై డ్రోన్ల వినియోగం, వాటిని నిల్వ చేయడం, అమ్మడం, కొనడం, రవాణాపై నిషేధం విధించింది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ మహ్మద్ ఆయిజాజ్ ఆదేశాలు జారీచేశారు. డ్రోన్ కెమెరాలు, ఇతర ఏరియల్ వెహికిల్స్ ఉన్నవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. అయితే, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు సంబంధిత రంగాలు చేసే సర్వేలు, ఇతర నిఘా కార్యకలాపాల కోసం డ్రోన్ల వాడకానికి నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. ఇందుకోసం సంబంధిత విభాగాలు స్థానిక పోలిస్ స్టేషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.