దేవాదాయశాఖ వరంగల్ జోన్ డీసీగా శ్రీకాంత్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీకాంత్ రావు నియమితులయ్యారు. ఏడాదిగా ఇంచార్జితో నెట్టుకొస్తున్న దేవాదాయ శాఖ ఎట్టకేలకు పూర్తిస్థాయి డీసీని నియమించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ రావుకు పదోన్నతి కల్పించి వరంగల్ జోన్ డీసీగా కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయరామారావు ఇప్పటివరకూ ఇంచార్జి డీసీగా పనిచేశారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు శ్రీకాంత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీకాంత్ రావు నియమితులయ్యారు. ఏడాదిగా ఇంచార్జితో నెట్టుకొస్తున్న దేవాదాయ శాఖ ఎట్టకేలకు పూర్తిస్థాయి డీసీని నియమించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ రావుకు పదోన్నతి కల్పించి వరంగల్ జోన్ డీసీగా కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయరామారావు ఇప్పటివరకూ ఇంచార్జి డీసీగా పనిచేశారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు శ్రీకాంత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జి డీసీతో అటు జిల్లాలోని శాఖ నిర్వహణ చూస్తూ జోన్‌లోని ఆలయాలపై దృష్టి పెట్టడం కష్టతరంగా మారింది. కొత్త డీసీ నియామకం జరగడంతో ఆలయాలు, ఉద్యోగుల పనుల్లో వేగం పెరగనుంది.