15 నుంచి మార్గశిర మాసోత్సవాలు
దిశ,విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్ధానంలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 13 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎస్.జ్యోతిమాధవి తెలిపారు. ఆలయ ఆవరణలో ఉత్సవాలకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మార్గశిర మాసోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని రావాలని తెలిపారు. కోవిడ్ సందర్భంగా భక్తులు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, […]
దిశ,విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్ధానంలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 13 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎస్.జ్యోతిమాధవి తెలిపారు. ఆలయ ఆవరణలో ఉత్సవాలకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మార్గశిర మాసోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని రావాలని తెలిపారు.
కోవిడ్ సందర్భంగా భక్తులు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. వీవీఐపీలకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలవరకు దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఎవరికీ గర్భాలయ ప్రవేశం ఉండదని, దర్శనం చేసుకున్న భక్తులకు రోజు ఐదువేల ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. మార్గశిర గురు వారాల్లో పదివేలమందికి ప్రసాదం వితరణ చేస్తామన్నారు. చివరి గురువారం దాదాపు ఇరవై వేల మందికి ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. భక్తులు ఎవ్వరూ స్లాట్ బుకింగ్ లేకుండా రావద్దని తెలిపారు.