అప్పుల ఊబిలో మౌలిక సదుపాయాల సంస్థ!
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల వ్యవహారం ముగింపునకు చేరుకోకముందే మరోసారి దేశీయ బ్యాంకులకు మరో ప్రమాదం పొంచి ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన స్థిరాస్తి రంగంలోని సంస్థ ఎవర్‌గ్రాండ్ సంక్షోభం తరహాలోనే దేశీయంగా శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్ఐఈఐ) సంస్థ కూడా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్‌లను చేపడుతోంది. ఈ సంస్థ ఆర్థిక రంగంలోకి […]
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల వ్యవహారం ముగింపునకు చేరుకోకముందే మరోసారి దేశీయ బ్యాంకులకు మరో ప్రమాదం పొంచి ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన స్థిరాస్తి రంగంలోని సంస్థ ఎవర్‌గ్రాండ్ సంక్షోభం తరహాలోనే దేశీయంగా శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్ఐఈఐ) సంస్థ కూడా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్‌లను చేపడుతోంది. ఈ సంస్థ ఆర్థిక రంగంలోకి కూడా కార్యకలాపాలు ప్రారంభించి కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూకో బ్యాంక్ సహా పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలను తీసుకుంది.
అయితే, గత కొన్నేళ్లుగా ఈ సంస్థ నిర్వహణ లోపాలను ఎదుర్కుంటోంది. గతేడాది కొవిడ్ మహమ్మారి వల్ల సంస్థకు కష్టాలు పెరిగాయి. ఉద్యోగులకు వేతనాలు చెల్లించని దీనస్థితికి చేరుకుంది. అంతేకాకుండా ఈ నెలలోనే ఎస్ఆర్ఈఐ సీఈఓ సైతం రాజీనామా చేయడంతో పరిశ్రమ వర్గాల్లో ఈ అంశం చర్చనీయంశం అయింది. ఎస్ఆర్ఈఐ గ్రూపు అప్పులు మొత్తం 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 29 వేల కోట్ల)కు పైగా ఉండొచ్చని అంచనా. ఇవన్నీ బ్యాంకుల వద్ద తీసుకున్నవే. ఇప్పటికే సంస్థ రుణాలు చెల్లించని కారణంగా దాని ఆస్తులను ఎన్‌పీఏలుగా గురించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. బ్యాంకులు సంస్థ పనితీరుపై అసంతృప్తి కారణంగా ఈ నేపథ్యంలో బ్యాంకులు తర్వాతి చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.