ఆరేళ్ల తర్వాత కనిపించిన స్టోర్క్ పక్షి

వైల్డ్ బర్డ్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్యాగ్ చేసిన పెయింటెడ్ స్టోర్క్ పక్షి ఆరేళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. బర్డ్ ఫ్లూ పరిశోధనలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా పెయింటెడ్ స్టోర్క్ పక్షి కనిపించింది. వింగ్ ట్యాగు నెం. ఏ40 నెంబరుతో ఉన్న ఈ పక్షి, ఫిబ్రవరి 2న పక్షి ప్రేమికుడు సందీప్ నగరేకి కనపడింది. ఇలా పక్షి కనిపించడం దాని గమనాన్ని అంచనా వేయడానికి, వైరస్ ఎక్కడి వరకు వ్యాప్తి చెందిందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని […]

Update: 2020-02-20 05:31 GMT

వైల్డ్ బర్డ్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్యాగ్ చేసిన పెయింటెడ్ స్టోర్క్ పక్షి ఆరేళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. బర్డ్ ఫ్లూ పరిశోధనలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా పెయింటెడ్ స్టోర్క్ పక్షి కనిపించింది. వింగ్ ట్యాగు నెం. ఏ40 నెంబరుతో ఉన్న ఈ పక్షి, ఫిబ్రవరి 2న పక్షి ప్రేమికుడు సందీప్ నగరేకి కనపడింది.

ఇలా పక్షి కనిపించడం దాని గమనాన్ని అంచనా వేయడానికి, వైరస్ ఎక్కడి వరకు వ్యాప్తి చెందిందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆర్నిథాలజిస్ట్ డాక్టర్ సతీష్ పాండే అన్నారు. ఈలా ఫౌండేషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి 2008 నుంచి వైల్డ్ బర్డ్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌ని బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిశీలించడానికి చేపడుతున్నారు. 2014లో పూణెలో పెయింటెడ్ స్టోర్క్ పక్షులతో పాటు బ్లాక్ హెడెడ్ ఇబిస్, గ్రే హెరాన్స్, నైట్ హెరాన్స్ పక్షులను ట్యాగ్ చేశారు. ఇవి కొన్నాళ్లకు కనిపించిన తర్వాత వాటికి బర్డ్ ఫ్లూ సోకిందా లేదా అని పరీక్ష చేస్తారు. సోకలేదని తేలితే వాటిని మళ్లీ అడవి వాతావరణంలో వదిలేస్తారు. ఈ పరిశోధన వల్ల ఏయే ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ఇంకా క్రియాశీలకంగా ఉంోద తెలుసుకునే వీలు కలుగుతుంది.

Tags:    

Similar News