Zimbabwe vs Afghanistan : చివరి బంతికి జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ

అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.

Update: 2024-12-11 17:46 GMT

దిశ, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు 20 ఓవర్లకు 144/6 పరుగులు చేసింది. ఆరంభంలోనే అఫ్గానిస్తాన్ టాప్ ఆర్డర్ తడబడటంతో 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో నబి, కరీం జనత్ ధాటిగా ఆడటంతో 144 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. జింబాబ్వే బౌలర్ నగర్వా28/3 అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఓపెనర్ బెనట్ (49) ధాటిగా ఆడాడు. చివర్లో తషింగా ముసెకివా 13 బంతుల్లో 16 పరుగులతో మెరవడంతో లాస్ట్ బాల్‌కు జింబాబ్వే జట్టు విజయం సాధించింది. చివరి 6 బంతులకు 11 పరగులు చేయాల్సి ఉండగా తషింగా తొలి బంతికే ఫోర్ బాదాడు. తరువాత వరుస బంతుల్లో 2,2 పరుగులు చేశాడు. నాల్గవ బంతికి పరుగు రాలేదు. ఐదో బంతికి మళ్లీ 2 పరుగులు చేశాడు. తర్వాత చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా సింగిల్ తీసి జట్టును గెలిపించాడు. 

Tags:    

Similar News