వారిద్దరితోనే వరల్డ్ కప్ గెలవలేం : Kapil Dev

ఈ ఏడాది అక్టోబర్‌లో సొంత గడ్డ మీద జరగబోతున్న వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.

Update: 2023-01-03 12:17 GMT
వారిద్దరితోనే వరల్డ్ కప్ గెలవలేం : Kapil Dev
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్‌లో సొంత గడ్డ మీద జరగబోతున్న వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దీంతో సొంత గడ్డ మీద ఎలాగైనా సరే కప్ గెలవాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసింది. అయితే టీమిండియా ప్లేయర్స్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యాలు చేశాడు. కోహ్లి, రోహిత్‌లతోనే వరల్డ్ కప్ గెలవలేం.. అంటూ కపిల్ దేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వారిద్దరూ మాత్రమే టీమిండియాకు కప్ అందించలేరని.. యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలని కపిల్ దేవ్ సూచించాడు. జట్టుకు ఎప్పుడూ ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే మూలస్తంభాల్లా ఉంటున్నారని.. దాన్ని మనం బ్రేక్ చేసి.. అలాంటి ఐదారుగురు ఆటగాళ్లను తయారు చేసుకోవాలని సూచించాడు.

Tags:    

Similar News