శిర్షాసనంతో సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్

సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు సందర్భంగా.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2023-04-24 03:37 GMT
శిర్షాసనంతో సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు సందర్భంగా.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సెహ్వాగ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ వీడియోలో సెహ్వాగ్ శీర్షాసన వేస్తూ.. మాస్టర్ బ్లాస్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆ వీడియోకు సెహ్వాగ్ ఇలా క్యాప్షన్ ఇచ్చారు.. "మీరు మైదానంలో నాకు ఏది చెప్పినా, నేను ఎల్లప్పుడూ దానికి విరుద్ధంగా చేశాను, కాబట్టి నేను మీ 50వ పుట్టినరోజు శీర్షాసన చేయడం ద్వారా శుభాకాంక్షలు చెప్పవలసి వచ్చింది." "పాజీ... ఆప్ జియో హజారోన్ సాల్... సాల్ కే దిన్ హో ఏక్ కరోడ్" అని రాసుకొచ్చాడు.

Tags:    

Similar News