Asia Cup 2023: మరోసారి డ్రింక్స్ బాయ్‌గా మారిన విరాట్ కోహ్లీ.. మున్నా భాయ్‌లా పరుగు.. వీడియో వైరల్

Update: 2023-09-15 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్రేక్ సమయంలో డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌తో కలిసి డ్రింక్స్ తీసుకొచ్చాడు. ఈ సమయంలో ‘హేరాపేరీ’ సినిమాలో అక్షర్ కుమార్‌ని ఇమిటేట్ చేస్తూ రన్నింగ్ చేసి.. నవ్వులు పూయించాడు విరాట్.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ గత 8 వన్డే మ్యాచుల్లో డ్రింక్స్ బాయ్‌గా మారడం ఇది మూడోసారి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్‌కి రాని విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఈ సమయంలో డ్రింక్స్ బాయ్‌గా వ్యవహరించాడు కోహ్లీ.

వరుసగా రెండు విజయాలతో ఆసియా కప్ 2023 ఫైనల్‌కి అర్హత సాధించిన టీమిండియా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ రిజర్వు బెంచ్‌కి పరిమితం అయ్యారు. వీరి స్థానంలో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు.


Similar News