విరాట్, అనుష్క దంపతులు తమ కొడుకుకు ఏం పేరు పెట్టారో తెలుసా?
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క జోడీ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొంతకాలంగా కోహ్లీ, అనుష్క మరోసారి పేరేంట్స్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, వాటిపై వారు స్పందించలేదు. తాజాగా తమకు కొడుకు పుట్టినట్టు వెల్లడించారు. బాబుకు ’అకాయ్’గా నామకరణం చేసినట్టు చెప్పారు. ‘ఫిబ్రవరి 15న మగ బిడ్డకు జన్మనిచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. వామిక తమ్ముడు, మా బేబీ బాయ్ అకాయ్ను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. ఈ ఆనందమైన సమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం. అలాగే, మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభ్యరిస్తున్నాం.’ అని విరుష్క జోడీ పోస్టు పెట్టింది. కాగా, 2017లో విరాట్, అనుష్క వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారికి తొలి సంతానంగా 2021లో వామిక జన్మించింది. మరోవైపు, విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.