హిమాన్షు శతకం.. మధ్యప్రదేశ్ 252 ఆలౌట్

రంజీ ట్రోఫీలో విదర్భతో జరుగుతున్న సెమీస్‌లో ఓపెనర్ హిమాన్షు శతకంతో సత్తాచాటడంతో మధ్యప్రదేశ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం దక్కింది.

Update: 2024-03-03 16:29 GMT

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో విదర్భతో జరుగుతున్న సెమీస్‌లో ఓపెనర్ హిమాన్షు శతకంతో సత్తాచాటడంతో మధ్యప్రదేశ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 47/1తో ఆదివారం ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. రెండో రోజు మధ్యప్రదేశ్‌ భారీ స్కోరు చేయకుండా విదర్భ బౌలర్లు అడ్డుకున్నారు. హిమాన్షు(126) ఒక్కడే పోరాటం చేయగా.. మిగతా వారు నిరాశపరిచారు. శరన్ష్(30), సాగర్(26), హర్ష్ గావ్లీ(25) క్రీజులో నిలబడినా భారీ స్కోర్లు సాధించలేకపోయారు. విదర్భ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, యశ్ ఠాకూర్ మూడేసి వికెట్లతో సత్తాచాటగా.. అక్షయ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు విదర్భను మధ్యప్రదేశ్ బౌలర్లు 170 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన విదర్భ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ(2)ను అవేశ్ ఖాన్ అవుట్ చేశాడు. ధ్రువ్(10 బ్యాటింగ్), అక్షయ్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ ఇంకా 69 పరుగులు వెనుకబడి ఉన్నది. 

Tags:    

Similar News