ముంబై ఇండియన్స్ కు బిగ్ షాకిచ్చిన తిలక్ వర్మ!

ముంబై ఇండియన్స్ జట్టు ( Mumbai Indians) యాజమాన్యానికి బిగ్ షాక్ ఇచ్చాడు ఆ జట్టు స్టార్ ఆటగాడు తిలక్ వర్మ ( Tilak varma )

Update: 2025-04-06 10:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ జట్టు ( Mumbai Indians) యాజమాన్యానికి బిగ్ షాక్ ఇచ్చాడు ఆ జట్టు స్టార్ ఆటగాడు తిలక్ వర్మ ( Tilak varma ). తన సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ పేరును తొలగించి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ప్లేయర్ తిలక్ వర్మ...తన ఇంస్టాగ్రామ్ ( Instagram ) బయోలో ముంబై ఇండియన్స్ పేరును తొలగించాడట. దీనికి సంబంధించిన కథనాలు నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై తిలక్ వర్మ గుర్రుగా ఉన్నాడని... ఆ జట్టు నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

మొన్న జరిగిన లక్నో మ్యాచ్ లో రిటైర్డ్ హర్ట్ సంఘటన నేపథ్యంలో... ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహంతో తిలక్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా తన ఇంస్టాగ్రామ్ బయోలో ముంబై ఇండియన్స్ పేరు తొలగించాడట తిలక్ వర్మ. అంతకు ముందు తిలక్ వర్మ ఇంస్టాగ్రామ్ బయోలో.. ముంబై ఇండియన్స్ పేరు కనిపించేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పేరును తొలగించాలని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై ముంబై యజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

గతంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) విషయంలో కూడా ఇలాగే జరిగింది. రోహిత్ శర్మను పక్కకు పెట్టి... హార్దిక్ పాండ్యాను ( Hardik Pandya ) కెప్టెన్ చేసింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ సందర్భంగా ఇది జరిగింది. ఆ సమయంలో కూడా.. ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో పోస్టులు పెట్టారు. ఇక ఇప్పుడు... నేరుగా ముంబై ఇండియన్స్ పై తిలక్ వర్మ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News