Rishabh Pant ఆరోగ్యంపై తాజా అప్‌డేట్ ఇదే..!

రిషభ్ పంత్ ఇటీవల రోడ్డుప్రమాదానికి గురికాగా తీవ్రగాయాలయ్యాయి.

Update: 2023-01-02 08:37 GMT

దిశ, వెబ్ డెస్క్: రిషభ్ పంత్ ఇటీవల రోడ్డుప్రమాదానికి గురికాగా తీవ్రగాయాలయ్యాయి. అయితే తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై డీడీసీఏ(ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్) డైరెక్టర్ శ్యామ్ స్పందిస్తూ పంత్ ఆరోగ్యం మెరుగవుతోందని తెలిపారు. కాలి లిగ్మెంట్ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పంత్ ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ప్రైవేటు వార్డుకు తరలించినట్లు తెలిపారు. పంత్ కోలుకునే వరకు డెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారని, నుదుటికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని పేర్కొన్నారు. కాగా టీమిండియా వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ పంత్ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో పంత్ స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చాడు. అయితే ఈ ప్రమాదంతో పంత్ తలకు, కాలికి గాయాలయ్యాయి. బెంజ్ కారు పూర్తిగా ధగ్ధమైన విషయం తెలిసిందే.   

Also Read...

IPL 2023: ఢిల్లీకి కొత్త కెప్టెన్.. రేసులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్..!! 

Tags:    

Similar News