IND VS SL : రోహిత్‌ను ఫాలో అవుతా..: టీ20 కెప్టెన్ సూర్యకుమార్
నాయకత్వంలో టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతానని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : నాయకత్వంలో టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతానని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య.. రోహిత్‌ను ప్రశంసించాడు. కెప్టెన్‌గా కంటే రోహిత్ గొప్ప నాయకుడని చెప్పాడు. ‘రోహిత్ కెప్టెన్‌గా కంటే నాయకుడిగా ఉన్నాడు. అతని నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నాను. నేను అదే అనుకరించాలనుకుంటున్నా. జట్టులో ఎక్కువ మార్పులు ఉండవు. కెప్టెన్ మాత్రమే మారాడు.’ అని తెలిపాడు.
హార్దిక్ పాండ్యా రోల్ గురించి స్పందిస్తూ.. పాండ్యా రోల్‌లో ఎలాంటి మార్పు ఉండదని, అతను చాలా ముఖ్యమైన ఆటగాడన్నాడు. ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఎక్స్ ఫ్యాక్టర్‌గా చూస్తున్నామని, అతనికి మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉందని చెప్పాడు. కెప్టెన్సీ అదనపు బాధ్యతలను ఇచ్చిందని, అయితే తన బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగిస్తానని తెలిపాడు. 2014 నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధముందని, తాము ఒక్కరినొకరం అర్థం చేసుకుంటామని చెప్పాడు.