మహ్మద్ షమీపై గతంలో వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆసక్తికర కామెంట్స్

టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీపై గతంలో వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Update: 2023-02-14 16:52 GMT

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీపై గతంలో వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ అలాంటి వాడు కాదని, 200 శాతం అతను ఫిక్సింగ్ పాల్పడలేదని నమ్ముతానని చెప్పాడు. షమీకి తన భార్య హసీన్ జహాన్‌ మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అప్పట్లో షమీ పై హసీన్ తీవ్ర ఆరోపణలు చేసింది.

తనపై షమీ గృహహింసకు పాల్పడుతున్నాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడని ఆరోపించింది. దీంతో బీసీసీఐ యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసి షమీకి క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఇషాంత్ శర్మ షమీపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడాడు. 'దీనిపై బీసీసీఐ ఏసీయూ అందరినీ సంప్రదించింది. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయగలడా? లేదా? అని మమ్మల్ని అడిగారు.

షమీ ఈ విషయం గురించి నాతో చాలా సేపు మాట్లాడాడు. షమీ వ్యక్తిగత విషయాలు నాకు తెలియవు. కానీ, 200 శాతం షమీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడలేదనే నమ్ముతా. షమీ గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పిన మాటలతో అతడిని నేనెలా అర్థం చేసుకున్నానో తెలుసుకున్నాడు. అప్పటి నుంచి మా అనుబంధం ఇంకా బలపడింది' అని ఇషాంత్ తెలిపాడు.

Tags:    

Similar News