న్యూజిలాండ్ గడ్డపై తొలి విజయం అందుకున్న శ్రీలంక

ఆదివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శ్రీలంక న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదట టై అవ్వడంతో సూపర్ ఓవర్ ఆడారు.

Update: 2023-04-02 08:50 GMT
న్యూజిలాండ్ గడ్డపై తొలి విజయం అందుకున్న శ్రీలంక
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శ్రీలంక న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదట టై అవ్వడంతో సూపర్ ఓవర్ ఆడారు. దీంతో సూపర్ ఓవర్ లో 9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక.. న్యూజిలాండ్ గడ్డపై తొలి పూర్తి స్థాయి విజయాన్ని అందుకుంది. 2006 లో న్యూజిలాండ్ తో జరిగిన టీ20లో లంక జట్టు గెలిచినప్పటికీ వారు వర్షం కారణంగా DLS మెథడ్ ద్వారా విజయం సాధించారు. కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీలంక న్యూజిలాండ్ గడ్డపై విజయం సాధించలేదు.

Tags:    

Similar News