సౌతాఫ్రికా స్పిన్నర్ సంచలనం.. వరుసగా 66 ఓవర్ల స్పెల్!
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన బౌలింగ్ తో అందరిని షాక్ కి గురిచేశాడు.
దిశ, వెబ్ డెస్క్: వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన బౌలింగ్ తో అందరిని షాక్ కి గురిచేశాడు. ఇటీవలే ముగిసిన తొలి టెస్ట్ లో మహారాజ్ వరుసగా 66.2 ఓవర్లు వేసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 8 వికెట్లు తీసుకున్న మహారాజ్, తొలి ఇన్నింగ్స్ లో 40 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్ లో 26 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో వరుసగా 40 ఓవర్లు వేసిన మహారాజ్.. రెండు ఇన్నింగ్స్ ల్లో మొత్తం 66.2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 వికెట్లు పడగొట్టాడు. 1990 లో ఇంగ్లాండ్ లోని ది ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో.. భారత ఆటగాడు నరేంద్ర హీర్యాని పేరిట వరుసగా అత్యధిక ఓవర్లు వేసిన రికార్డు ఉంది. అతను టెస్ట్ లో వరుసగా 59 ఓవర్లు వేసి సుదీర్ఘ స్పెల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.