అభిషేక్ శర్మ పేపర్ లాగేసుకున్న శ్రేయస్ అయ్యర్

సన్రైజర్స్ హైదరాబాద్ (SRH ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య శనివారం రోజున జరిగిన మ్యాచ్ లో చాలా సంఘటనలు జరిగాయి.

Update: 2025-04-13 04:16 GMT
అభిషేక్ శర్మ పేపర్ లాగేసుకున్న  శ్రేయస్ అయ్యర్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : సన్రైజర్స్ హైదరాబాద్ (SRH ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య శనివారం రోజున జరిగిన మ్యాచ్ లో చాలా సంఘటనలు జరిగాయి. ప్రీతి జింటా వర్సెస్ కావ్య పాప అన్నట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ కాగా... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer ) బ్యాటింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ భయంకరంగా ఆడి భారీ స్కోరు చేసింది. అయితే.. పంజాబ్ కింగ్స్ విధించిన భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కూడా.. హైదరాబాద్ ఆటగాళ్లు ఎక్కడ తగ్గలేదు. హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ దుమ్ము లేపారు.

హెడ్ ఆఫ్ సెంచరీ చేసుకోగా... అభిషేక్ శర్మ ( Abhishek Sharma) సెంచరీ పూర్తి చేసుకొని రఫ్ఫాడించాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.... ఆ తర్వాత అదిరిపోయే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. సెంచరీ పూర్తి కాగానే తన జేబులో ఉన్న ఓ పేపర్ ముక్కను తీసి ప్రేక్షకులందరికీ చూపించి.. సందడి చేశాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma). తన సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసమే అన్నట్లుగా ఇంగ్లీషులో రాసుకోవచ్చాడు.

అదే పేపర్ ను స్టేడియం లో ప్రేక్షకులందరికీ... చూపించి తన సెంచరీని అందరికీ అంకితం చేశాడు. ఈ తరుణంలోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అక్కడికి వచ్చి... అభిషేక్ శర్మ చేతిలో ఉన్న కాగితాన్ని లాగేసుకున్నాడు. అందులో ఏముందని చదివాడు. ఆ తర్వాత చాహల్ కూడా ఆ పేపర్ ను తీసుకొని చదివాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News