టీమిండియాకు షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కు స్టార్ ప్లేయర్ దూరం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియాకు షాక్ తగిలింది. వెన్ను గాయంతో బాధపడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కానున్నాడు.
దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియాకు షాక్ తగిలింది. వెన్ను గాయంతో బాధపడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కానున్నాడు. వెన్ను నొప్పి కారణంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో అయ్యర్ బ్యాటింగ్‌కు దిగని సంగతి తెలిసిందే. గాయానికి అయ్యర్ లండన్ లేదా మరోచోట సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.
ముంబైకి చెందిన డాక్టర్ దగ్గర చికిత్స పొందుతున్న అయ్యర్‌కు సర్జరీ అవసరమని చెప్పినట్లు సమాచారం. సర్జరీ చేయించుకున్నాక కనీసం ఐదు నెలలపాటు అతడు ఆటకు దూరం కానున్నాడు. అంటే మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ అతడు ఆడే అవకాశమే లేదు. వరల్డ్ కప్ నాటికి అతడు కోలుకునే అవకాశం ఉంది. కానీ అప్పటికీ అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండకపోవచ్చు.