రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శిఖర్ ధావన్..

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ 2021లోనే తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు.

Update: 2023-03-27 03:28 GMT

దిశ, వెబ్ డెస్క్:టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ 2021లోనే తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు.నిజానికి ధవన్ తనకు వయసులో దాదాపు 12ఏళ్ల పెద్దదైన అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఆస్ర్టేలియా లోని మెల్‌బోర్న్‌కి చెందిన అమెచ్యూర్ కిక్ బాక్సర్‌గా పేరొందిన అయేషాకు ఇదివరకే పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తన మొదటి భర్తతో అయేషా 2012 విడాకులు తీసుకొని శిఖర్ ధావన్ ను వివాహం చేసుకుంది. 2014లో వీరికి జోరావర్ అనే కొడుకు పుట్టాడు.

ఏం జరిగిందో తెలీదు కానీ.. 2021, సెప్టెంబరులో శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మీడియాకి దూరంగా ఉంటున్నాడు శిఖర్ ధావన్. ఇదే సమయంలో భారత్ జట్టులో అతను చోటు కూడా కొల్పోయాడు. గత కొంత కాలంగా అతను క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో తన సత్తా చాటి టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు పట్టుదలతో ప్రాక్టీస్ ప్రారంభించాడు గబ్బర్. ఈ సీజన్ లో అతను పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు.

అయేషా ముఖర్జీతో విడాకుల విషయంపై శిఖర్ మాట్లాడుతూ ‘నేను వివాహ బంధం విషయంలో విఫలమయ్యాను. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఇందులో వేరొకరిని నిందించం కరెక్ట్ కాదు. నాకు ఆ వషయంలో పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు నేను క్రికెట్ గురించి మాట్లాడే విషయాలపై 20 ఏళ్ల క్రితం నాకు అవగాహన కూడా లేదు. అందుకే అనుభవం అన్నీ నేర్పిస్తుందంటారు’ అంటూ అని చెప్పుకొచ్చాడు. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు గబ్బర్ సమాధానమిచ్చాడు.

‘ప్రస్తుతానికి విడాకుల కోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే? ఈ సారి కాస్త తెలివిగా వ్యవహరిస్తాను. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో అర్థమైందన్నాడు. నేను 26-27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రికెట్ కోసం ఎక్కువ సమయం కేటాయించే వాడినని. ఆ టైమ్‌లో ఎలాంటి ఆలోచనలు లేవన్నాడు. ఒకవేళ ప్రేమలో పడితే.. ఈ సారి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటానంటూ’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News