సెహ్వాగ్ ఎవరు?- బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ విమర్శ

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు.దీనంతటికీ భారత మాజీ దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను విమర్శించడమే కారణంగా తెలుస్తోంది.

Update: 2024-06-14 14:14 GMT

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు.దీనంతటికీ భారత మాజీ దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను విమర్శించడమే కారణంగా తెలుస్తోంది. గురువారం నెదర్లాండ్స్‌పై జరిగిన లీగ్ మ్యాచులో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. అయితే, టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అయ్యాక తొలిసారి ఫామ్ అందుకున్న షకీబ్ అర్థసెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ తనను విమర్శించడంపై షకీబ్ స్పందిస్తూ.. అసలు సెహ్వాగ్ ఎవరు చెప్పడానికి? అతడు క్రికెటర్లకు సలహాలు ఇవ్వకుండా రిటైర్మెంట్ తీసుకోవాలని అన్నాడు.

షకీబ్ కామెంట్స్‌పై చిర్రెత్తుకొచ్చిన సెహ్వాగ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మనోడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.‘నీకు సెహ్వాగ్ ఎవరో తెలీదా? వన్డేల్లో బంగ్లా జట్టుపై డబుల్ సెంచరీ బాదిన వీరుడు’ అంటూ దానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో బంగ్లా జట్టు సూపర్ -8కు చేరుకోవాలంటే తదుపరి మ్యాచ్‌లో గెలిస్తేనే అది సాధ్యపడుతుంది. అయితే, గ్రూప్ -డీలో భాగమైన బంగ్లాదేశ్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా తొలిస్థానంలో నిలిచింది.


Similar News